సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని జ్యోతినగర్ ప్రాంతంలో అక్రమ రేషన్ బియ్యం అధికారులు పట్టుకున్నారు.. ప్రత్యేక తనిఖీలలో 80 బస్తాల (సుమారు 37 క్వింటాళ్ల) రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను అధికారులు సీజ్ చేశారు. డ్రైవర్ రాజు, ఆటో యజమాని జైపాల్, అలాగే రేషన్ బియ్యం అక్రమ విక్రయానికి పాల్పడిన రేషన్ డీలర్ అలివేలమ్మ పై చర్యలు చేపట్టారు. డిప్యూటీ తహసీల్దార్ (సివిల్ సప్లై) అనిల్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు