ప్రజల నుంచి అందుతున్న పిజిఆర్ఎస్ ఫిర్యాదులను నిర్దిష్ట గడువులో పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్
Ongole Urban, Prakasam | Apr 6, 2026
ప్రకాశం జిల్లాలో ప్రజల నుంచి అందుతున్న పిజిఆర్ఎస్ ఫిర్యాదులను నిర్దిష్ట గడువులో పరిష్కరించేలా ప్రత్యేక దృష్టిలో సారించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు, అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యు అధికారి శ్రీ చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మహేష్, రమేష్, డిపిఓ వెంకటేశ్వర రావు లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.