చిన్నమండెం:పేదరికం,కరువు లేని రాష్ట్రంగా మారుస్తాం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా గృహప్రవేశం చేస్తున్న ప్రతి కుటుంబానికి ఆయన అభినందనలు తెలిపారు. 2029 నాటికి ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తామన్నారు.ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్తగా ఎం ఎస్ ఎం ఈ లను అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలను అందిస్తామన్నారు. డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేస్తామన్నారు. డ్వాక్రా సంఘాలు పొదుపు పథకం ద్వారా వేల కోట్లు పొదుపు చేయడం అభినందనీయమన్నారు. గతంలో పేదలకు పక్కా ఇల్లు గృహాలు కట్టించే కార్యక్రమాన్ని స్వర్గీయ ఎన్టీఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు.