రాయచోటి ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు శనివారం ఉదయం అదుపుతప్పి పక్కకు ఒరిగిన ఘటన చోటుచేసుకుంది. రాయచోటి నుంచి సుండుపల్లె దిశగా ప్రయాణిస్తున్న బస్సు ఆనంపల్లి సమీపంలో ఎదురు దిశ నుంచి వచ్చిన కారు ఢీకొట్టే ప్రమాదాన్ని తప్పించడానికి డ్రైవర్ ప్రయత్నించగా బస్సు రోడ్డు పక్కకు వాలిపోయింది.బస్సులో ఉన్న 38 మంది ప్రయాణికులు ఎవరూ గాయపడకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.