నంద్యాల అర్బన్: మంత్రి ఫరుకును మర్యాదపూర్వకంగా కలిసిన నంద్యాల జిల్లా నూతన అడిషనల్ ఎస్పీ ఖాదర్బాషా
Nandyal Urban, Nandyal | Jun 30, 2026
నంద్యాల జిల్లా నూతన అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎస్. ఖాదర్ భాషా మంగళవారం మంత్రి ఎన్ఎండీ ఫరూక్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఖాదర్ భాషా మంత్రికి పూల మొక్కను అందజేశారు. మంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.