ప్లాస్టిక్ రహిత బనగానపల్లెకు సహకరించండి: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ
బనగానపల్లె: ప్లాస్టిక్ రహిత బనగానపల్లెకు అందరూ సహకరించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పిలుపునిచ్చారు. బుధవారం బనగానపల్లె పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులకు ప్లాస్టిక్ నుంచి కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. రాబోయే తరాలకు మనం స్వచ్ఛమైన పరిశుభ్రతతో కూడిన వాతావరణాన్ని అందించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ప్రజలు తమ నిజజీవితంలో ప్లాస్టిక్ను నిర్మూలించాలని కోరారు.