ఆళ్లగడ్డ: డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వ్యక్తికి ఐదు రోజులు జైలు శిక్ష ఆళ్లగడ్డ రూరల్ ఎస్సై వరప్రసాద్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన తనిఖీలలో మిట్ట పల్లె ఓబులేశ్ మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడుపుతూ పట్టుపడ్డాడు, బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో పరిమితికి మించి మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు, మంగళవారం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రవికుమార్ ఎదుట హాజరుపరచగా ఐదు రోజులు జైలు శిక్ష విధించారు