ఖాజీపేట ప్రాంతంలో విద్యుత్ వినియోగదారులు గత ఐదు రోజులుగా తీవ్ర లో వోల్టేజీ సమస్యను ఎదుర్కొంటున్నారు. పునరావృతంగా ఈ సమస్యపై ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బిల్లులు చెల్లించకపోతే వెంటనే సరఫరా నిలిపివేసే విద్యుత్ శాఖ, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.తక్షణమే సమస్యను పరిష్కరించి, ప్రజలకు స్థిరమైన విద్యుత్ అందించాలంటూ జిల్లా ఉన్నతాధికారులను వినియోగదారులు కోరుతున్నారు.