అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా కల్లూరు రైల్వే స్టేషన్ యార్డ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి
Anantapur Urban, Anantapur | Apr 29, 2026
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని కల్లూరు రైల్వే స్టేషన్ యార్డ్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడని అనంతపురం రైల్వే ఎస్సై వెంకటేష్ వివరాలను వెల్లడించారు. 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి క్రీమ్ కలర్ షర్టు, బ్లూ కలర్ లుంగీ ధరించి ఉన్నాడని తెలిపారు. అతని వద్ద ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని ఆయన వెల్లడించారు. దీంతో మృతదేహాన్ని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరచడం జరిగిందని తెలిపారు. మృతుడిని గుర్తిస్తే వివరాలను రైల్వే పోలీసులకు తెలపాలని ఆయన కోరారు.