ప్రకాశం జిల్లా తర్లపాడు మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం నందు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సుమారు 103 అర్జీలు వచ్చినట్లుగా తెలిపారు వీటిలో ఎక్కువ శాతం రెవెన్యూ సమస్యలు ఉన్నాయన్నారు. వాటిలో 90 శాతం పరిష్కరించడం జరుగుతుందని మిగిలిన పరీక్ష శాతం ఎందుకు పరిష్కరించలేదో తెలియజేయడం జరుగుతుందన్నారు. స్వీకరించిన అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కరించమన్నారు.