నంద్యాల అర్బన్: మహానంది మండలంలో భారీ వర్షం
Nandyal Urban, Nandyal | Jun 6, 2026
నంద్యాల జిల్లా మహానంది మండలంలో శనివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వారం రోజులుగా రోహిణి కార్తె ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. వాతావరణం చల్లబడటంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పొలాలు అదునులోకి వస్తే సేద్యాలు ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. కాగా, వర్షం కారణంగా మహానంది క్షేత్రానికి వచ్చిన భక్తులు కాస్త ఇబ్బందులు పడ్డారు.