సంగారెడ్డి: వీధి వ్యాపారులకు రుణాల మంజూరులో ఎలాంటి జాప్యం చేయరాదు : సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్
వీధి వ్యాపారులకు రుణాల మంజూరు లో ఎలాంటి జాప్యం చేయరాదని వెంటనే రుణాలు మంజూరు చేయాలని సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశం మందిరంలో అడిషనల్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన బ్యాంకర్స్ సమావేశానికి మొప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్బి రామాచారి లీడ్ డిస్టిక్ మేనేజర్ నర్సింగరావు బ్యాంకు ప్రతినిధులు హాజరైనారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ వీధి వ్యాపారుల క్షేమం కోసం రూపొందించబడ్డ పీఎం స్వానిది, నిస్సహాయ వర్గాల క్షేమం కోసం రూపొందించిన డి జయ్ పథకాల అమల్లో నిర్లక్ష్యం చేయరాదని ఆదేశించారు.