నంద్యాల అర్బన్: మహానంది మండలంలో జోరు వర్షం, గాజుల పల్లెలో పిడుగు
Nandyal Urban, Nandyal | May 30, 2026
నంద్యాల జిల్లా మహానంది మండల పరిసర గ్రామాల్లో శనివారం తెల్లవారుజామున ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. గాజులపల్లె మౌలాలి స్వామి దర్గా వద్ద పెద్ద చెట్టుపై పిడుగు పడటంతో వృక్షం, విద్యుత్ స్తంభం నేలకూలాయి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.