కరీంనగర్: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ లో కారు బీభత్సవం సృష్టించింది, ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు నమోదయ్యాయి
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ లో ఓ కారు మంగళవారం బీభత్సవం సృష్టించింది. హైదరాబాదు నుంచి కరీంనగర్ వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను దాటి రోడ్డుకు అవతలి వైపు దూసుకెళ్లి రేలింగుకు ఢీ కొట్టింది. అధిక వేగంగా రావడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. కారులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు నమోదయింది.