ఉరవకొండ: ఆర్డిటి సంస్థ సేవలను పేదలకు అందకుండా అడ్డుకోవడం అన్యాయం: హరిత దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మోహన్ నాయక్
ఆర్ డి టి సంస్థ సేవలను పేదలకు అందకుండా అడ్డుకోవడం అన్యాయం అని హరిత దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మోహన్ నాయక్ పేర్కొన్నారు. ఆదివారం అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహ విద్యార్థులతో కలిసి సేవ్ ఆర్డిటి బ్యానర్ తో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేదలకు చేసిన సేవలు మరువలేనివి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవచూపి ఆర్డిటి సంస్థకు ఎఫ్ సి ఆర్ ఏ ను పునరుద్ధరించాలని కోరారు. సేవ్ ఆర్డిటి కోసం ఈనెల 15న జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ చేపట్టిన ర్యాలీని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.