నంద్యాల అర్బన్: రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుకు వ్యతిరేకంగా నంద్యాలలో స్టాంపు రైటర్ల నిరసన
Nandyal Urban, Nandyal | Jul 2, 2026
నంద్యాల పట్టణ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద స్టాంప్ రైటర్లు గురువారం ఆందోళనకు దిగారు.ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్ల రిబ్బన్లు ధరించి నిరసన చేపట్టారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ తమ ఆందోళనను వ్యక్తం చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సబ్ రిజిస్ట్రార్ అందజేశారు