అరకులోయ: పద్మాపురం బొట్టానికల్ గార్డెన్ లో సోమవారం నుంచి అందుబాటులోకి హాట్ ఎయిర్ బెలూన్
అరకులోయ పద్మాపురం బొటానికల్ గార్డెన్స్‌లో హాట్ ఎయిర్ బెలూన్ సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి వస్తున్నట్లు నిర్వాహకులు గట్ల సంతోశ్ ఆదివారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 నుంచి 11 వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. 15నిమిషాలు ఫ్లయింగ్ టైం ఉంటుందన్నారు. దీంతో శీతాకాలంలో అరకులోయ అందాలైన మంచు తెరలు, వలిసె పూలను గాల్లో వివరిస్తూ పర్యాటకులు మరింత ఆస్వాదించనున్నారు.