ఉరవకొండ: ఈనెల 12న హలో విద్యార్థి చలో అనంతపురం కార్యక్రమంతో ఏఐఎస్ఎఫ్ రాష్ట్రవ్యాప్త బస్సుజాత ముగింపు సభను విజయవంతం చేయండి
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హలో విద్యార్థి చలో అనంతపురం కరపత్రాలను ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం విడుదల చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి తగ్గుపర్తి చందు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 12న అనంతపురంలో జరిగే రాష్ట్రవ్యాప్త బస్సుజాత ముగింపు సభను హలో విద్యార్థి చలో అనంతపురంతో జయప్రదం చేయాలన్నారు. ఎన్నికలలో విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, ప్రభుత్వ వసతి గృహాల్లో పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేసారు.