నందికోట్కూరు: మత్తులో డ్రైవింగ్... మృత్యువుకు ఆహ్వానం : పాములపాడు ఎస్ఐ తిరుపాల్
నంద్యాల జిల్లా పాములపాడు మద్యం మత్తులో వాహనం నడపడం వలన అత్యధికగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పాములపాడు ఎస్ఐ తిరుపాల్ తెలిపారు, రుద్రవరం టోల్ ప్లాజా వద్ద పాములపాడు ఎస్ఐ తిరుపాల్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు, మద్యం తాగిన హెల్మెట్ లేని వాహనదారులను గుర్తించి జరిమానాలు విధించారు, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులను హెచ్చరించారు