బనగానపల్లె: పాణ్యం వద్ద రోడ్డు ప్రమాదం, ఆళ్లగడ్డ ఏఎస్ఐ మృతి
నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ ఏఎస్సై సురేశ్ కుమార్ మృతి చెందారు. అనంతపురం నుంచి వివాహ వేడుకకు హాజరై తిరిగి ఆళ్లగడ్డకు వస్తుండగా కారు టైరు పేలి డివైడర్ను ఢీకొంది. ప్రమాదంలో ఏఎస్సై అక్కడికక్కడే మృతి చెందగా.. మరో హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు మహిళలు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం నంద్యాల శాంతిరాం ఆస్పత్రికి తరలించారు.