నంద్యాల అర్బన్: బెంగాల్లో బిజెపి విజయం,,నంద్యాలలో సంబరాలు
Nandyal Urban, Nandyal | May 4, 2026
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించడంపై నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం పార్టీ కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకొని బీజేపీకి పట్టం కట్టారని, ప్రధాని మోదీ నాయకత్వంలో రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల్లోనూ కమలం వికసిస్తుందన్నారు