గుంతకల్లు: గుత్తిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ, విజయవంతం చేయాలని వైసీపీ నాయకులు విజ్ఞప్తి
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి అధ్యక్షతన జరిగే కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని వైసీపీ నాయకులు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్అండ్ బీ బంగ్లాలో మంగళవారం రచ్చబండ, కోటి సంతకాల సేకరణ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. నాయకులు మధుసూదన్ రెడ్డి, కోనా మురళీధర్ రెడ్డి, హుస్సేన్ పీరా, గురుప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ, అనుబంధ విభాగాల కమిటీల నియామకం గురించి గుత్తి పట్టణంలోని కోటకు వెళ్ళే దారిలో నాగులకట్ట వద్ద ఉంటుందన్నారు.