రాజేంద్రనగర్: అబ్దుల్లాపూర్మెట్ మండలంలో ఏఐటియుసి వ్యవస్థాపక దినోత్సవం
అబ్దుల్లాపూర్మెట్ మం. రావి నారాయణ రెడ్డి కాలనీ 2లో ఏఐటీయూసీ 106వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర నాయకుడు ఆందోజు రవీంద్ర చారి, ముత్యాల యాదిరెడ్డి, మండల కార్యదర్శి అజ్మీర హరి సింగ్ నాయక్ తదితరులు హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు.