కనిగిరి: పట్టణంలోని ఆర్టీసీ డిపో నుండి పాకల బీచ్ కు ప్రతి ఆదివారం ప్రత్యేక బస్సులు: కనిగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ సయానా బేగం
కనిగిరి పట్టణంలోని ఆర్టీసీ డిపో నుండి ప్రతి ఆదివారం పాకల బీచ్ కు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు కనిగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ సయానా బేగం తెలిపారు. ఆదివారం మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ తో కలిసి పాకలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను డిపో మేనేజర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... ప్రతి ఆదివారం కనిగిరి నుండి బయలుదేరి వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు శ్రీ శక్తి పథకం వర్తిస్తుందని, ఉచితంగా ఈ బస్సుల్లో మహిళలు ప్రయాణించవచ్చన్నారు. అదేవిధంగా ఈ బస్సుల్లో ఒక్కో టిక్కెట్ ధర రూ.80 లు గా నిర్ణయించడం జరిగిందన్నారు