సంక్రాంతి పండుగ రాబోతున్న నేపథ్యంలో, బాలానగర్ ACP నరేష్ రెడ్డి ప్రజలను దొంగలపై జాగ్రత్తగా ఉండమని గురువారం హెచ్చరించారు. పండుగల సమయంలో దొంగతనాలు పెరుగుతాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ACP, బంగారం, విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండానే బ్యాంక్ లాకర్లలో భద్రపరచాలని ప్రజలకు సూచించారు. అలాగే ఊరెళ్లేముందు పక్కింటివారికి, స్థానిక పోలీస్ స్టేషన్కు తెలియచేయడం ద్వారా భద్రత ఏర్పాట్లు చేయవచ్చని తెలిపారు. పండుగ వేళలో భద్రత, జాగ్రత్తలు ముఖ్యమని ACP నరేష్ రెడ్డి గుర్తు చేశారు.