అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గొందురెడ్డిపల్లి గ్రామంలో 5:10 నిమిషాల సమయంలో అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ అరటి సాగు చేసిన పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ మాట్లాడుతూ గొందిరెడ్డిపల్లి గ్రామంలో రైతులు పండిస్తున్న అరటి సాగును పరిశీలించడం జరిగిందని రైతులకు నాణ్యతగా పండించిన పంటకు విదేశాలకు తీసుకు వెళ్లేందుకు ప్రైవేటు ఏజెన్సీ వారు సిద్ధంగా ఉన్నారని జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ పేర్కొన్నారు.