గుండ్లపల్లి: అక్రమంగా ఇసుకరు తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన డిండి పోలీసులు
నల్గొండ జిల్లా, డిండి మండల పరిధిలోని గోనకోల్ సరిహద్దులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు రెండు ట్రాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై బోదాసు రాజు మాట్లాడుతూ.. గోనకోల్ సరిహద్దులో ఎలాంటి అనుమతులు లేకుండా ఆక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని డ్రైవర్లు రమావత్ అశోక్, కాట్రావత్ లాలూ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై రాజు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.