నిజామాబాద్ రూరల్: సిరికొండలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆసర పెన్షన్ పెంచాలని ఆందోళన
సిరికొండ మండల కేంద్రంలో మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు దీపక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆసరా పెన్షన్లను పెంచుతామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తాసిల్దార్ రవీందర్‌రావుకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ రూ.4000 నుండి రూ 6000/- పెంచుతామని, అలాగే వృద్ధులు వితంతువులతో పాటు ఇతర పెన్షన్ దారుల పెన్షన్లు రూ 2000/-నుండి రూ. 4000/- పెంచుతామని హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాగ్దానం చేశారు