ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
Ongole Urban, Prakasam | Apr 6, 2026
ఒంగోలు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో వైసిపి అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి కార్యకర్తలు నాయకులతో సమావేశం నిర్వహించారు. ముందుగా బూచేపల్లి పుట్టినరోజు పురస్కరించుకొని నాయకుల కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బూచేపల్లి ఈ సందర్భంగా మాట్లాడుతూ, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఇటువంటి పుట్టిన రోజులు వస్తుంటాయి పోతుంటాయి కానీ మళ్ళీ జగనన్ననే సీఎం గా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని బూచేపల్లి కార్యకర్తలకు నాయకులకు తెలిపారు.