కనిగిరి పట్టణంలో కొలువైన శ్రీ విజయ మార్తాండేశ్వర స్వామి ఆలయ భూములు ఆక్రమణలకు గురయ్యాయని కార్యనిర్వహణాధికారి నరసింహ బాబు కనిగిరి తహసిల్దార్ జయలక్ష్మి కి ఫిర్యాదు చేశారు. కార్యనిర్వహణాధికారి ఫిర్యాదు మేరకు తహసిల్దార్ జయలక్ష్మి సిబ్బందితో కలిసి ఆక్రమణలకు గురైన శ్రీ విజయ మార్తాండేశ్వర స్వామి ఆలయ భూములను పరిశీలించారు. ఎంత మేర ఆలయ భూములు ఆక్రమణలకు గురయ్యాయో గుర్తించి వివరాలను అందజేయాలని సర్వేయర్ ను తహసిల్దార్ ఆదేశించారు. శ్రీ విజయ మార్తాండేశ్వర స్వామి ఆలయ భూములను ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ హెచ్చరించారు.