ఒంగోలు అర్బన్: జ్ఞానప్రకాశ్ 6 రోజుల FLN శిక్షణా కార్యక్రమాన్ని సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి
Ongole Urban, Prakasam | Jun 6, 2026
ఒంగోలు పట్టణంలోని PVR బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జ్ఞానప్రకాశ్ 6 రోజుల ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొంటున్న ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థుల్లో ప్రాథమిక చదవడం, రాయడం, గణిత నైపుణ్యాల అభివృద్ధికి FLN కార్యక్రమం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు FLN లక్ష్యాల సాధనకు అంకితభావంతో కృషి చేయాలని సూచించారు.అలాగే మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని, తెలియజేశారు