మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు కల్పించలేకపోయారు : గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
గురజాల నియోజకవర్గంలో దాచేపల్లి, గురజాల మున్సిపాలిటీలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూటమీ ప్రభుత్వం విఫలమైందని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో దాచేపల్లి పట్నంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలకు వచ్చిన ర్యాంకులు చూస్తే నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలు దారుణమైన పరిస్థితిలో ఉన్నాయన్నారు. ర్యాంకులు చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదన్నారు.