గుడిహత్నూరు: ఆదిలాబాద్ జిల్లా లో ప్రారంభమైన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం ఫస్ట్ ఇయర్ పరీక్ష.. మధ్యాహ్నం సెకండ్ ఇయర్ పరీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లాలో సప్లమెంటరీ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 4141 మంది, సెకండ్ ఇయర్ పరీక్షకు 2092 మంది విద్యార్థులు రాయనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.