కడప: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడం సిగ్గుచేటు : ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి
Kadapa, YSR | Sep 16, 2025 పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ప్రైవేటీకరణ చేయడం దుర్మా ర్థమని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి, జిల్లా ఉపాధ్యక్షుడు రాజ శేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్న ఉద్దేశంతో పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళాశాల పనులను నిలిపివేసి పీపీపీ పద్ధతిలో కొనసాగించడానికి వీలు లేదు అన్నారు.