ఆత్మకూరు: బోయల సిరివల్ల గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, పోలీసులు లంచాలు తీసుకుంటున్నారంటూ ఆరోపించిన గ్రామస్తులు
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరు మండలం, బోయల సిరివెళ్ల గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాప్ లు పలువురు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు తీవ్రంగా ఆరోపించారు. అధికారులు నెల మామూలు తీసుకొని పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ఎక్సైజ్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. తమ గ్రామంలో వెంటనే బెల్ట్ షాపులను నివారించాలని కోరారు.