తాడిపత్రి: యాడికి మండలంలోని వెంగన్నపల్లిలో వైసిపి నేత ఇంటిపై రాళ్లు కట్టలతో దాడి చేసిన దుండగులు,తీవ్రంగా గాయపడిన లక్ష్మీనాథ్ రెడ్డి
తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలం వెంగన్నపల్లిలో బుధవారం వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించింది. ఈ క్రమంలో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు నాగముని రెడ్డి పలువురితో కలిసి వైసీపీ నాయకుడు లక్ష్మీనాథ్ రెడ్డి ఇంటిపై రాళ్లు, కట్టెలతో దాడి చేశారు. ఈ దాడిలో లక్ష్మీనాథ్ రెడ్డితో పాటు ఆయన తల్లి వెంకట లక్ష్మమ్మ తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.