సంగారెడ్డి: ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠంలో అతిపెద్ద నంది విగ్రహం ఏర్పాటు : శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి
ఫసల్వాదిలో శ్రీజ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద నంది విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీమహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 32 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు, 18 అడుగుల ఎత్తుతో 684 టన్నుల బరువు నందీశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.