కర్నూలు: విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీ పోరాటాలు : సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు సి.ఐ.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎం.డి. అంజిబాబు, జిల్లా నాయకుడు బి. నాగరాజు తెలిపారు.కర్నూలు సి.ఐ.టి.యు జిల్లా కార్యాలయం — కార్మిక కర్షక భవన్లో వారు విలేకరులతో మాట్లాడుతూ, అక్టోబర్ 17న పవర్ జేఏసీ నాయకత్వంలో ప్రభుత్వంతో జరిగిన చర్చలు కాంట్రాక్ట్ కార్మికులకు ఏమాత్రం ఉపయోగపడలేదని విమర్శించారు. “సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ కార్మికుల విలీనం, డైరెక్ట్ పేమెంట్” వంటి ప్రధాన డిమాండ్లపై