రాప్తాడు: రాప్తాడు లో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో బుధవారం 11:30 గంటల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీని చేపట్టి ఎమ్మార్వో కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17 మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేస్తుందని వాటికి వ్యతిరేకంగా నేడు నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఎమ్మార్వో కు వినతి పత్రం ఇచ్చామని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపకుంటే పోరాటం చేస్తామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.