అసిఫాబాద్: ఆసిఫాబాద్ బస్టాండ్ ఎదుట బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ధర్నా
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కు అడ్డుపడితే సహించేది లేదని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నార్ రమేష్ హెచ్చరించారు. బీసీ జేఏసీ రాష్ట్ర వ్యాప్త బంద్ లో భాగంగా శనివారం ఉదయం ఆసిఫాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ప్రధాన ద్వారం ఎదుట బీసీ సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.