ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో ఆకట్టుకున్న కళాకారుల కోలాటం నృత్య ప్రదర్శన
ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో స్వామివారి కల్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు బుధవారం సాయంత్రం స్వామివారి ఆలయ సన్నిధిలో విశాఖపట్నం కు చెందిన కోలాటం నృత్య కళాకారులు నిర్వహించిన కోలాటం నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. ఈ మేరకు ఆధ్యాత్మిక గీతాలకు లయబద్ధంగా వారు కోలాటం నిర్వహించారు.