బనగానపల్లె: బనగానపల్లెలో భారీ కొండచిలువ కలకలం.
నంద్యాల జిల్లా బనగానపల్లెలోని వేణుగోపాలయ్య తోట ప్రాంతంలో గత కొన్నిరోజులుగా భారీ కొండచిలువ సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ప్రాంతం కావడంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటకు రావాలంటే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి కొండచిలువను పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు.