అనంతపురం అర్బన్: తాడిపత్రి తహసిల్దార్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు రైతు నుంచి లంచం తీసుకుంటుండగా వీఆర్వో ను అరెస్టు చేసిన అధికారులు
Anantapur Urban, Anantapur | Apr 29, 2026
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని తాడిపత్రి తాసిల్దార్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా రైతు ప్రభాకర్ రెడ్డి నుంచి 30 వేలు లంచం తీసుకుంటున్న విఆర్వో రామకృష్ణను ఏసీబీ సీఐ అమిత్ ఖాన్ తన సిబ్బందితో కలిసి అరెస్టు చేశారు. మిగులు భూమిని పాస్ బుక్ లోకి ఎక్కించేందుకు 30000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసిబి అధికారులు తెలిపారు.