గంగాధర: ఈనెల 27న ఆస్ట్రేలియాలో బతుకమ్మ వేడుకలకు హాజరుకానున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ ఆధ్వర్యంలో,ఆస్ట్రేలియాలోని బ్రిస్సెన్స్ నగరంలో ఈనెల 27న బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు,ఈ మేరకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమును హాజరు కావాలని,అసోసియేషన్ సభ్యులు గత వారం రోజుల క్రితం ఆహ్వానించారు,అసోసియేషన్ సభ్యుల ఆహ్వానం మేరకు ఈనెల 22వ తేదీన రాత్రి హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్ళనున్నట్లు,27వ తేదీన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని తిరిగి 28న స్వదేశానికి తిరుగు ప్రయాణం కానున్నట్లు,ఆదివారం 6:20 PM కి కరీంనగర్ జిల్లా,గంగాధర మండలం,మధుర నగర్ లోని ప్రజా పార్టీ కార్యాలయం నుండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు,