అనుముల: హాలియా సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న 9 మంది సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
నల్గొండ జిల్లా, అనుముల మండలం, హాలియా పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హాలియా సర్కిల్, త్రిపురారం పోలీస్ స్టేషన్, పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న 9మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి 25 బైకులు, రెండు తులాల బంగారం, 5 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చోరీ చేసిన బైకుల విలువ 25 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రస్తుతం దొంగలను పట్టుకోవడం సులభమని, దొంగతనాలకు పాల్పడితే కటకటాల పాలు కాక తప్పదని హెచ్చరించారు.