రాజేంద్రనగర్: బి ఎన్ రెడ్డి నగర్ డివిజన్ లో సిసి రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి
BN రెడ్డి నగర్ డివిజన్లో పలు కాలనీల్లో CC రోడ్ల నిర్మాణ పనులను కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ప్రారంభించారు. స్థానికులతో కలిసి పనులను పర్య వేక్షిస్తూ, ప్రతి కాలనీ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. సాయిరాంకాలనీకి రూ.17.50 లక్షలు, ఆఫీసర్స్ కాలనీకి రూ.34 లక్షలు, NGO కాలనీకి రూ.21 లక్షలు, శ్రీపురంకాలనీకి రూ.18 లక్షలతో రోడ్ల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు పాల్గొన్నారు.