అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని రాంనగర్ రైల్వే బ్రిడ్జి సమీపంలో రైలు కిందపడి గుర్తు తెలియని వృద్ధుడు మృతి
Anantapur Urban, Anantapur | Apr 7, 2026
అనంతపురం నగరంలోని రాంనగర్ రైల్వే బ్రిడ్జి క్రింద రైలు కిందపడి 60 సంవత్సరాలు వయస్సు కలిగిన గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి రైల్వే ఎస్సై వెంకటేష్ మంగళవారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అతని వద్ద ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.