కొత్తపట్నంలో పెద్దిరెడ్డి సూర్య ప్రకాశ్ రెడ్డి పల్లె కారులపై దాడి చేయడానికి ఖండించిన దళిత నేత నీలం నాగేంద్రం
Ongole Urban, Prakasam | May 12, 2026
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మడనూరులో పెద్దిరెడ్డి సూర్య ప్రకాశ్ రెడ్డి పల్లెకారులపై దాడి చేశారని ఆరోపించారు. దళిత నేత నీలం నాగేంద్రం మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సూర్య ప్రకాష్రెడ్డి సామాన్యులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తున్నారన్నారు. 'భూ-కబ్జాలకు పాల్పడుతున్నా అధికారులు మౌనంగా ఉన్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల స్పందించాలని డిమాండ్ చేశారు.