నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో వర్షాల కోసం అన్నదాతల ఎదురుచూపులు
Nandyal Urban, Nandyal | Jul 7, 2026
వర్షాకాలం వచ్చినా.. వరుణుడి కరుణ ఆశించినంతగా లేదు. ఇవాళ, రేపు అయినా వర్షం పడకపోదా? అని అన్నదాతలు ఆశలు పెట్టుకుంటున్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా రైతన్నలు పంటల సాగు కోసం పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతుండటం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.