ఆత్మకూరు: సంగం పెన్నా నదిలో తప్పిన పెను ప్రమాదం, కొట్టుకుపోయిన మూడు పడవలు
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, సంగం పెన్నా వారధి వద్ద పెనుప్రమాదం తప్పింది. పెన్నానదిలో ఇసుక తరలించేందుకు నిల్వ ఉంచిన 3 పడవలు వరద నీటి ప్రభావంతో తాళ్లు తెగి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అయితే అదృష్టవశాత్తు అవి వారధి గేట్లను తాకకుండానే గట్టున ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్నందున నదికి సమీప ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు బుధవారం సూచించారు.